శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 22:09:13

శుక్రగ్రహంపై జీవం.. ఇంటర్నెట్‌లో పేలిన జోకులు..

శుక్రగ్రహంపై జీవం.. ఇంటర్నెట్‌లో పేలిన జోకులు..

హైదరాబాద్‌: అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే ఇటీవల శాస్త్రవేత్తలు గొప్ప ఆవిష్కరణ చేశారు. వీనస్‌(శుక్రగ్రహం)పై ఫాస్ఫైన్‌ అనే వాయువు ఉందని కనుగొన్నారు. అంటే అక్కడ జీవం ఉండే అవకాశముందని అంచనా వేశారు. బహుశా ఏలియన్స్‌ స్థావరం అదేనేమో అని భావిస్తున్నారు. అయితే, ఇప్పటిదాకా కేవలం మార్స్‌(అంగారక గ్రహం)పై మాత్రమే జీవం ఉందని భావిస్తూ వస్తున్న పరిశోధకుల దృష్ఠి శుక్రగ్రహంపైకి మరలింది.  

ఈ ఆవిష్కరణపై ఇంటర్నెట్‌లో సరదా పోస్టులు దర్శనమిచ్చాయి. మీమ్స్‌, కార్టూన్స్‌తో నెటిజన్లు హోరెత్తించారు.‘అయ్యో నేనిప్పటిదాకా ఒంటరిగా ఎందుకున్నానో అర్థమైంది. నా సరిజోడి కోసం నేను వేరే గ్రహంపై వెతుకుతున్నానన్న మాట.’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. ‘ఇది అసలే 2020.. బహుశా భూమిపై ఉన్న మనల్ని వీనస్‌పై ఉన్న జీవులు చంపేస్తాయేమో’  అంటూ మరొకొరు సరదాగా వ్యాఖ్యానించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo