గురువారం 26 నవంబర్ 2020
International - Nov 17, 2020 , 17:24:15

లాభాల్లో ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు

వాషింగ్టన్: అమెరికా స్టాక్ మార్కెట్ల తోపాటు అంతర్జాతీయ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఫైజర్, బయోఎన్‌టెక్, నోనావ్యాక్స్, తాజాగా మోడర్నా వ్యాక్సీన్ ప్రకటన తో  మార్కెట్లు పుంజుకున్నాయి. కేసులు పెరిగినప్పటికీ తమ వ్యాక్సీన్ 90 శాతానికి పైగా ఫలితం కనిపి స్తున్నదని వెల్లడించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.  గతవారం ఫైజర్ ప్రకటించడంతో ఆ స్టాక్స్ ఎగిశాయి. ఇప్పుడు మోడర్నా షేర్లు లాభపడ్డాయి. అంతకుముందు వ్యాక్సీన్ పైన ఫైజర్ ప్రకటన చేయడంతో మరుసటి రోజు షేర్లు భారీగా పెరిగాయి. తాజాగా మోడర్నా 94 శాతం ఫలితం వచ్చిందని తెలిపింది. మోడర్నా ప్రకటన అనంతరం ఫైజర్ స్టాక్స్ నేడు పడిపోయాయి.

నేడు ఫైజర్ స్టాక్స్ 2.5 శాతానికి పైగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లో బయోఎన్‌టెక్ స్టాక్ కూడా 13.66 శాతం, నోవావ్యాక్స్ స్టాక్ 6.16 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం మేర నష్టపోయింది. అదే సమయంలో మోడర్నా స్టాక్ 10 శాతానికి పైగా ఎగిసింది. ఒక ఫార్మా కంపెనీ కరోనా టీకాపై సానుకూల ప్రకటన చేసినప్పుడు, మరో కరోనా వ్యాక్సీన్ తయారు చేసే కంపెనీపై ప్రభావం కనిపిస్తున్నది. ఫైజర్ నుండి మోడర్న్ ఇంక్ వరకు ప్రకటనల నేపథ్యంలో అమెరికా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు హుషారు వచ్చింది. తాజా సెషన్‌లో డౌజోన్స్ 470.63 అంటే1.60శాతం లాభపడి 29,950.44 వద్ద, నాస్‌డాక్ 94.84 అంటే 0.80శాతం లాభపడి 11,924.13 పాయింట్ల వద్ద, ఎస్ అండ్ పీ 41.76 అంటే 1.16శాతం ఎగిసి 3,626.91 వద్ద ముగిసింది. మోడర్నా ప్రకటన అనంతరం డౌజోన్స్ రికార్డు గరిష్టాన్ని తాకింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.