మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 30, 2020 , 13:05:17

ఎగిసిన అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు...

ఎగిసిన అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు...

వాషింగ్ టన్ :అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. నిన్నటివరకు భారీగా నష్టపోయిన అమెరికా స్టాక్స్ తాజాగా ఎగిశాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావర్జే 139 పాయింట్లు అంటే 0.52 శాతం లాభపడి 26,659.11 వద్ద, ఎస్ అండ్ పీ 39 పాయింట్లు అంటే 1.19 శాతం ఎగిసి 3,310.11 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 180 పాయింట్లు అంటే 1.64 శాతం  ఎగిసి11,185.59 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్ వ్యాల్యూమ్ ఎక్స్చేంజ్ 9.74 బిలియన్ షేర్లుగా ఉన్నది. ఆసియా మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.8 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 1.7 శాతం, ఆస్ట్రేలియా ఏ ఎస్ ఎక్స్-200 0.24 శాతం, సింగపూర్ ఎస్జీఎక్స్ 0.22 శాతం క్షీణించాయి. అయితే సౌత్ కొరియా కోస్పి1 శాతం, భారత్ నిఫ్టీ 70 పాయింట్ల మేర లాభాల్లో ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.