శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 15:17:49

ఇంట‌ర్నేష‌న‌ల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న డ‌చ్ ర‌చ‌యిత

ఇంట‌ర్నేష‌న‌ల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న డ‌చ్ ర‌చ‌యిత

హైద‌రాబాద్‌: డ‌చ్ ర‌చ‌యిత ఈ యేటి ఇంట‌ర్నేష‌న‌ల్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకున్నాడు.  29 ఏళ్ల మారికి లూకాస్ రీజ‌న‌వెల్డ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.  ద డిస్‌కంఫ‌ర్ట్ ఆఫ్ ఈవింగ్ అనే పుస్త‌కం అత‌ను రాశాడు.  ట్రాన్స్‌లేట‌ర్ మైఖేల్ హ‌ట్చిస‌న్ కూడా అవార్డును పంచుకుంటారు. 50వేల పౌండ్ల ప్రైజ్‌మ‌నీ ఇద్ద‌రూ తీసుకుంటారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ద్వారా బుక‌ర్ ప్రైజ్ అవార్డు సెర్మ‌నీ లైవ్ ప్ర‌జెంటేష‌న్ జ‌రిగింది.

30 భాష‌ల నుంచి త‌ర్జుమా అయిన 124 పుస్త‌కాల‌ను ఈ అవార్డు కోసం జ‌డ్జిలు ప‌రిశీలించారు. నెద‌ర్లాండ్స్ గ్రామీణ నేప‌థ్యంతో ఉన్న క‌థ‌కు ప్యానెల్ ప‌ట్టంక‌ట్టింది. సాంప్ర‌దాయ‌మైన క్రైస్త‌వ‌ వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన క‌థ‌ను లూకాస్ త‌న ర‌చ‌న‌లో ప్ర‌ద‌ర్శించాడు. డెయిరీలో ప‌నిచేసే లూకాస్ రాసిన పుస్త‌కం ఇప్ప‌టికే నెద‌ర్లాండ్స్‌లో ప్ర‌తిష్టాత్మ‌క ఏఎన్‌వీ డెబ్యూ ప్రైజ్‌ను గెలుచుకున్న‌ది.   


logo