సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 22:12:30

నేపాల్‌లో విమాన స‌ర్వీసులు పునఃప్రారంభం!

నేపాల్‌లో విమాన స‌ర్వీసులు పునఃప్రారంభం!

ఖాట్మండు: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. అన్ని దేశాల్లో క‌లిపి పాజిటివ్ కేసుల సంఖ్య కోటిన్న‌ర‌కు చేరువ‌య్యింది. మ‌ర‌ణాలు ఆరు ల‌క్ష‌లు దాటాయి. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం అన్ని దేశాలు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులను నిలిపివేశాయి. కొన్ని దేశాలు డొమెస్టిక్ ఫ్లైట్ స‌ర్వీసుల‌ను కూడా నిషేధించాయి. అయినా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో చేసేదేమీ లేక విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. 

తాజాగా నేపాల్ ప్ర‌భుత్వం కూడా నిలిచిపోయిన విమాన స‌ర్వీసుల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఆగ‌స్టు 17 నుంచి నేపాల్‌లో దేశీయ‌, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయ‌ని నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి తెలిపారు. సోమ‌వారం జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామని ఆయ‌న చెప్పారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo