బుధవారం 03 జూన్ 2020
International - May 12, 2020 , 11:00:50

580 ట‌న్నుల నిత్యావ‌స‌రాల‌తో మాలే పోర్టుకు ఐఎన్ఎస్ కేస‌రి

580 ట‌న్నుల నిత్యావ‌స‌రాల‌తో మాలే పోర్టుకు ఐఎన్ఎస్ కేస‌రి

న్యూఢిల్లీ: మిష‌న్ సాగ‌ర్ కార్య‌క్ర‌మంలో భాగంగా భారతీయ యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ కేస‌రి మాల్దీవులు రాజ‌ధాని అయిన మాలే పోర్టుకు చేరుకున్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇత‌ర దేశాల‌కు నిత్యావ‌స‌రాలు, అత్యావ‌స‌రాలు అయిన సరుకులు, ఔష‌ధాలు చేర‌వేయ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం మిష‌న్ సాగ‌ర్ కార్యక్రమాన్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా బ‌య‌లుదేరిన ఐఎన్ఎస్ కేస‌రి తొలి గ‌మ్య‌స్థాన‌మైన మాలే పోర్టుకు మంగ‌ళ‌వారం ఉద‌యం చేరుకున్న‌ది. మ‌ల్దీవుల ప్ర‌జ‌ల కోసం భార‌త ప్ర‌జ‌లు గిఫ్ట్‌గా పంపిన 580 ట‌న్నుల నిత్యావ‌స‌రాల‌ను అక్క‌డ దించిన‌ త‌ర్వాత తిరిగి భార‌త్‌కు బ‌య‌లు దేర‌నుంది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo