శనివారం 06 జూన్ 2020
International - May 16, 2020 , 10:58:22

మాలే నుంచి బయలుదేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

మాలే నుంచి బయలుదేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. వందేభారత్‌ మిషన్‌ పేరుతో వాయుమార్గాన, ఆపరేషన్‌ సముద్ర సేతు పేరుతో జలమార్గాన వేల మందిని స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఆపరేషన్‌ సముద్రసేతులో భాగంగా ఐఎన్‌ఎస్‌ జలాశ్వ యుద్ధనౌక మాల్దీవులు నుంచి స్వదేశానికి భారతీయులను తరలిస్తున్నది. ఇప్పటికే మొదటి మలుకలో 698 మందిని ఇండియన్స్‌ను చేరవేసిన జలాశ్వ.. రెండో మలుకలో మరికొందరిని తీసుకొచ్చేందుకు శుక్రవారం సాయంత్రం మాలే పోర్టుకు చేరుకుంది. ఈ ఉదయం 588 మంది ప్రయాణికులతో భారత్‌కు బయలుదేరింది. 


logo