బుధవారం 27 మే 2020
International - May 14, 2020 , 20:04:12

జైలు నుంచి బయటకు రావాలని.. కరోనా నాటకం

 జైలు నుంచి బయటకు రావాలని.. కరోనా నాటకం

లాస్‌ఏంజెల్స్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుపెట్టుకొన్ని జైలు నుంచి బయటకు రావాలని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ కంట్రీ జైలులో కొందరు ఖైదీలు నాటకం ఆడారు. ఈ ఖైదీలు చేసిన పిచ్చి పని సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. ఒకరు తాగిన నీటిని మరొకరు తాగడం, ఒకరు ముక్కు చీదిన మాస్క్‌ను మరొకరు కావాలని ధరిస్తూ వైరస్‌ను అంటించుకోవాలని ఖైదీలు ప్రయత్నించారు. వీరు చేసిన ఘనకార్యానికి రిజల్ట్‌ కూడా వెంటనే వచ్చేసింది. 

జైలులో రెండు వారాల వ్యవధిలో దాదాపు 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అవాక్కయ్యారు. దాంతో అనుమానం వచ్చిన అధికారులు జైలు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో వారి ఘనకార్యం బయటపడింది. కరోనా వ్యాధి పాజిటివ్‌గా వస్తే విడుదల  చేస్తారనుకొన్న ఖైదీలకు నిరాశే మిగిలింది. అమెరికాలోని జైళ్లలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా ఖైదీలకు కరోనా వైరస్‌ సోకగా.. 350 మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.


logo