శనివారం 30 మే 2020
International - May 03, 2020 , 12:40:30

బ్రెజిల్ జైల్లో ఖైదీల తిరుగుబాటు

బ్రెజిల్ జైల్లో ఖైదీల తిరుగుబాటు

బ్రెజిల్‌: బ్రెజిల్‌లోని మాన్సస్‌ సిటిలోగల ఓ జైల్లో ఖైదీలు తిరుగ‌బ‌డ్డారు. త‌మ‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేదంటూ అధికారులపై తిరుగుబాటు చేశారు. ఆరుగురు జైలు సిబ్బందిని బందీలుగా పట్టుకున్న ఖైదీలు.. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే వారిని వ‌దిలిపెడుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభ‌న మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఆ జైల్లో సౌకర్యాలు మరీ నాసిరకంగా తయార‌వ‌డంతో ఖైదీలు తిరుగుబాటు చేసిన‌ట్లు తెలిసింది. 

జైల్లో తమకు మంచి ఆహారం, బట్టలు లేవ‌ని, జబ్బున పడితే ఔష‌ధాలు కూడా స‌రిగా ఇవ్వ‌డంలేద‌ని, చాలా గదుల్లో విద్యుత్ బ‌ల్బులు కూడా లేవ‌ని ఖైదీలు చెబుతున్నారు. త‌క్ష‌ణ‌మే పైన పేర్కొన్న సౌక‌ర్యాల‌న్నీ క‌ల్పించాల‌ని వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఉద‌యం అల్పాహారం ముగించుకొని సెల్స్‌లోకి వెళ్లే సమయంలో ఖైదీలు తిరుగుబాటు చేశారని, వారి దుప్పట్లను తగులబెట్టి అల్లర్లకు దిగారని అధికారులు చెబుతున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo