శుక్రవారం 10 జూలై 2020
International - Jun 04, 2020 , 18:43:21

పెప్పర్‌ స్ప్రే ఖైదీ ప్రాణాలు తీసింది..!

పెప్పర్‌ స్ప్రే ఖైదీ ప్రాణాలు తీసింది..!

న్యూయార్క్‌: జైలులో ఉన్న ఖైదీ ఇనుపరాడ్‌తో తలుపును పగులగొట్టేందుకు ప్రయత్నించి..ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జైళ్లశాఖ అధికారులు ఓ కేసులో జామెల్‌ ప్లోయ్‌డ్‌ (35)ను అరెస్ట్‌ చేసి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ సెల్‌లో ఉంచారు. అయితే జామెల్‌ ప్లోయ్‌డ్‌ జైలులో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో..వీరంగం సృష్టించాడు.

జామెల్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్నవారందని బెదిరిస్తుండటంతో అడ్డుకునేందుకు అధికారులు అతనిపై పెప్పర్‌ స్ప్రే చల్లారు. అయితే జామెల్‌ పెప్పర్ స్ప్రే చల్లిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్దారించారు. ఇది కోవిడ్‌-19 సంబంధిత మరణం కాదని, జామెల్‌ మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఫ్రిజన్స్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.


logo