బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 15:47:37

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

జకార్త: ఇండోనేషియాలోని అనాక్‌ క్రాకటౌ అగ్నిపర్వతం బద్దలైంది. సుందా దీవిలో ఉన్న అగ్నిపర్వతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటని జియోలాజికల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 40 నిమిషాలపాటు సంభవించిన విస్ఫోటనంతో పెద్దఎత్తున దుమ్ము వెదజల్లిందని, దీంతో 500 మీటర్లకు పైగా ఎత్తులో పొగ కమ్ముకు పోయిందని పేర్కొన్నారు. ఈ అగ్నిపర్వతాన్ని 1927లో కనుగొన్నారు. 


logo