బుధవారం 27 జనవరి 2021
International - Jan 13, 2021 , 10:58:52

క‌రోనా టీకా తీసుకున్న ఇండోనేషియా అధ్య‌క్షుడు

క‌రోనా టీకా తీసుకున్న ఇండోనేషియా అధ్య‌క్షుడు

జ‌క‌ర్తా:  ఇండోనేషియా అధ్య‌క్షుడు జోకో విడోడు .. క‌రోనా వైర‌స్ టీకా వేయించుకున్నారు.  దేశంలో టీకా తీసుకున్న తొలి వ్య‌క్తిగా ఆయ‌న నిలిచారు.  చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ త‌యారు చేస్తున్న క‌రోనావాక్ టీకాను ఆయ‌న తీసుకున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ఇండోనేషియాలో ప్ర‌భుత్వ‌మే మొద‌లుపెట్టింది.  తొలి డోసు తీసుకున్న త‌ర్వాత అధ్య‌క్షుడు జోకో విడోడు మీడియాతో మాట్లాడారు.  దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వైర‌స్ వ్యాప్తిని టీకా అడ్డుకుంటుంద‌న్నారు.  వ్యాక్సినేష‌న్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంద‌ని జోకో విడోడు తెలిపారు. logo