బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 30, 2020 , 19:38:19

మొసలి మెడకు టైరు తీస్తే భారీ నజరానా

మొసలి మెడకు టైరు తీస్తే భారీ నజరానా

ఇండోనేషియాలోని ఓ సముద్రతీరం. 13 అడుగుల (సుమారు 4 మీటర్లు) పొడవైన భారీ మొసలి ఆ సముద్రతీరంలో తిరుగుతుండగా ఓ మోటారు సైకిల్‌ టైరు దాని మెడకు చుట్టుకుంది. ఈ ఘటన జరిగి చాలా సంవత్సరాలే అవుతుంది. అయితే తన మెడకు టైరు చుట్టుకోవడంతో మొసలి రోజువారీ కదలికల్లో మార్పు వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక వన్యప్రాణి సంరక్షణ బృందం అధికారులు ఎలాగైనా ఆ టైరును బయటకు తీసి మొసలికి విముక్తి కల్పించాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నా..ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రావిన్స్‌ గవర్నర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సూచనలు చేశారు.

మొసలి మెడకు చుట్టుకున్న టైరు తీసిన వారికి  భారీ నజరానా ప్రకటించాలని చెప్పారు. అంతేకాదు తాను సొంతంగా  నగదు రివార్డును అందజేస్తానని ప్రకటించారు. మొసలి దగ్గరకు ఎవరూ రావొద్దని ప్రజలకు సూచలను చేసినట్లు న్యాచురల్‌ రీసోర్స్‌ కన్జర్వేషన్‌ ఏజెన్సీ హెడ్‌ హస్ముని హస్మర్‌ తెలిపారు. మరి మొసలిని ఎవరు కాపాడి..బహుమతి పొందుతారో చూడాలి.


logo
>>>>>>