ఆదివారం 31 మే 2020
International - Apr 19, 2020 , 15:46:21

ఇండోనేషియాలో 6575కు చేరిన కరోనా కేసులు

ఇండోనేషియాలో 6575కు చేరిన కరోనా కేసులు

జకార్త: ఇండోనేషియాలో ఆదివారం ఒక్కరోజే 327 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,575కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో కొత్తగా 47 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 582కు చేరింది. అయితే అధికారులు చెబుతున్నదానికంటే మృతుల సంఖ్య రెండింతలు ఎక్కువగా ఉంటుందని ఇండోనేషియన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం ప్రకటించింది.


logo