గురువారం 28 మే 2020
International - Apr 23, 2020 , 18:28:24

నిషేధం అమ‌లుకు 1.75 ల‌క్ష‌ల బ‌ల‌గాలు

నిషేధం అమ‌లుకు 1.75 ల‌క్ష‌ల బ‌ల‌గాలు

న్యూఢిల్లీ: ప‌టిష్ట రంజాన్ మాసం నేప‌థ్యంలో జ‌నం ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్ల‌కుండా ఇండోనేషియా ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జ‌లు ప‌నిచేసే ప్రాంతాల నుంచి సొంతూళ్ల‌కు వెళ్ల‌కుండా ప్ర‌జారవాణాపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ప‌ట్టిష్టంగా అమ‌లు చేసేందుకు 1.75 ల‌క్ష‌ల మంది భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లించింది. రంజాన్ నేప‌థ్యంలో ప్ర‌జార‌వాణాకు అనుమ‌తిస్తే క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉన్నందున తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఇండోనేషియా స‌ర్కారు పేర్కొన్న‌ది. 

కాగా, ఇండోనేషియాలో ప్ర‌స్తుతం పాక్షికంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. అయితే రంజాన్ మాసం నేప‌థ్యంలో జ‌నం ద్వారా క‌రోనా వ్యాప్తి జ‌రుగ‌కుండా ప్ర‌జార‌వాణాపై నిషేధం విధించారు. ఈ నిషేధం ఏప్రిల్ 24 నుంచి మే 31 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌జ‌ల మేలు కోస‌మే తాను ఇంత క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఇండోనేషియా ప్ర‌ధాని జోకో విడోడో టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌క‌టించారు. కాగా, ఇండోనేషియాలో ఇప్ప‌టివ‌ర‌కు 7,775 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. మ‌రో 647 మంది మృతిచెందారు.    


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo