శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 19, 2021 , 12:39:18

చరిత్రలో ఈరోజు: తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ

చరిత్రలో ఈరోజు: తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ

తాష్కెంట్ ఒప్పందం జరిగిన రోజు రాత్రి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. జనవరి 12 న గుల్జారి లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. మరోవైపు, నాయకుడిని ఎన్నుకునే యుద్ధం కాంగ్రెస్‌లో ప్రారంభమైంది. ఏడు రోజుల తరువాత సరిగ్గా ఇదే రోజున 1966 దేశం మొదటి మహిళా ప్రధానమంత్రిని పొందబోతున్నదన్న నిర్ణయాన్ని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి 355 ఓట్లు వచ్చాయి. సీనియర్ నాయకుడు మొరార్జీ దేశాయ్‌కు కేవలం 169 ఓట్లు వచ్చాయి. ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోవడం మొరార్జీ దేశాయ్‌కి ఇది రెండోసారి. నెహ్రూ మరణానికి ముందే ఆయన ప్రధాని పదవికి పోటీలో ఉన్నారు. ఇందిరాను నెహ్రూ వారసుడిగా మొరార్జీ దేశాయ్ ఎప్పుడూ భావించలేదు. ఆమెను చిన్న అమ్మాయిగానే కొట్టిపారేశారు. 

లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో దేశ తదుపరి ప్రధాని ఎవరు అని ప్రశ్నలు తలెత్తాయి. ప్రధాని అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కే కామరాజ్‌పై పడింది. ప్రధాని పదవి కోసం మొరార్జీ దేశాయ్, ఇందిరా గాంధీ పేర్లు రేసులోకి వచ్చాయి. ఇదే సమయంలో కామరాజ్‌ పేరు కూడా రేసులోకి వచ్చింది అయితే, సిండికేట్‌ సమావేశంలో కామరాజ్‌ ప్రధాని కావడానికి నిరాకరించారు. ఇదే సమయంలో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డీపీ మిశ్రా ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి.. ఇందిరా గాంధీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో 14 మంది ముఖ్యమంత్రులు ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచారు. యూపీ, గుజరాత్ ముఖ్యమంత్రులు మాత్రమే మొరార్జీకి అనుకూలంగా ఉన్నారు.

ప్రధానమంత్రి పదవికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనవరి 19 న ఓటింగ్‌ నిర్వహించగా.. ఇందులో ఇందిరా గెలిచింది. మొరార్జీ దేశాయ్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీని 1966 జనవరి 19 న దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 అక్టోబర్ 31 న ఆమె హత్య జరిగిన రోజు వరకు ఆమె దేశ ప్రధానిగా ఉన్నారు. 

మరికొన్ని ముఖ్య సంఘటనలు

2006: ప్లూటో సమాచారం సేకరణకు న్యూ హారిజన్ అంతరిక్ష నౌకను ప్రయోగించిన నాసా

2000: న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో మొదటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెస్టారెంట్ ప్రారంభం

1990: పుణేలో ఆచార్య రజనీష్ ఓషో మరణం

1987: సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండు గంటల తర్వాత పదవీ విరమణ చేసిన నారాయణ్ దత్ ఓజా

1942: జపాన్ సైన్యం బర్మా (ఇప్పటి మయన్మార్) రాజధాని రంగూన్ (ఇప్పుడు యాంగోన్) నుంచి ఆగ్నేయంగా 235 మైళ్ల దూరంలో ఉన్న టివోయ్ నౌకాశ్రయాన్ని స్వాధీనం 

1907: వెరైటీ మ్యాగజైన్‌లో మొదటి సినిమా సమీక్ష ప్రచురణ

1905: హిందూ తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం

1883: ఉత్తర సముద్రంలో జర్మన్ స్టీమర్ సింబ్రియా, బ్రిటిష్ స్టీమర్ సుల్తాన్ మధ్య ఘర్షణ. ఈ ఘర్షణలో 340 మంది మరణం

1597: మేవార్‌కు చెందిన రానా ప్రతాప్ సింగ్ మరణం

- ఇంటర్నెట్‌ డెస్క్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo