సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 22, 2020 , 21:54:26

వాణిజ్య పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామం: కేటీఆర్‌

వాణిజ్య పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామం: కేటీఆర్‌

సులభతర వాణిజ్య పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామమనీ.. ఈ విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంస్థలు తెలియజేశాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ జరుగుతున్న ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన ఇండియా ఇన్‌ కార్పోరేషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కేటీఆర్‌ మాట్లాడుతూ.. సులభతర వాణిజ్య పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామమనీ.. ఈ విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంస్థలు తెలియజేశాయని మంత్రి తెలిపారు. సులభతర వాణిజ్య పెట్టుబడుల జాబితాలో భారత్‌ 63వ స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన తెలిపారు. దావోస్‌లో పలు ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు జరిగినట్లు మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. ఒప్పంద వివరాలను రేపు మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 


logo