ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 16:08:02

బ్రెజిల్‌కు టీకాలు.. భార‌త్‌ను మెచ్చుకున్న డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్‌

బ్రెజిల్‌కు టీకాలు.. భార‌త్‌ను మెచ్చుకున్న డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్‌

జెనీవా: కోవిడ్‌19 నిర్మూల‌నే ధ్యేయంగా భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇండియాలో త‌యారైన రెండు టీకాలు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అవుతున్నాయి.  ఇప్ప‌టికే ఇండియాలో 14 ల‌క్ష‌ల మంది కోవిడ్ టీకాలు వేసుకున్నారు.  అయితే కోవిడ్‌తో స‌త‌మ‌తం అవుతున్న బ్రెజిల్‌కు సుమారు 20 ల‌క్ష‌ల డోసుల టీకాల‌ను ఇండియా పంపించింది.  ఆ టీకా కంటేన‌ర్ల‌ను బ్రెజిల్ అందుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆ దేశాధ్య‌క్షుడు బొల్స‌నారో ట్వీట్ చేస్తూ.. ఇండియాకు థ్యాంక్స్ చెప్పారు.  ఈ సంద‌ర్భంగా కోవిడ్ నిర్మూల‌నకు భార‌త్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ప్ర‌శంసించింది.  డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ త‌న ట్వ‌ట్ట‌ర్‌లో ఈ విష‌యంపై స్పందించారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ కోసం భార‌త్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను స్వాగ‌తించిన ఆయ‌న‌.. భార‌త్‌,  ప్ర‌ధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు.  మ‌నం అంద‌రం క‌లిసి క‌ట్టుగా ప‌నిచేస్తేనే.. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోగ‌ల‌మ‌ని టెడ్రోస్ అన్నారు.  వైర‌స్‌కు సంబంధించిన జ్ఞానాన్ని షేర్ చేసుకోవాల‌న్నారు.  ప్ర‌జ‌ల‌ను, వారి జీవితాల‌ను ర‌క్షించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కీల‌క‌మైంద‌ని టెడ్రోస్ తెలిపారు.   

VIDEOS

logo