మంగళవారం 31 మార్చి 2020
International - Mar 21, 2020 , 18:19:26

యూఎస్‌లోని భారతీయులు జాగ్రత్త

యూఎస్‌లోని భారతీయులు జాగ్రత్త

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. వైరస్‌ భారిన పడకుండా, కోవిడ్‌-19 వ్యాధి నుంచి రక్షించుకునేందుకు ఎవరికి వారు స్వీయ నిర్బంధం విధించుకోవాలని సూచించింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఇచ్చే సలహాలను పాటించాల్సిందిగా కోరింది. కోవిడ్‌-19 కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo
>>>>>>