బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 09:21:08

అయోధ్య‌లో వేడుక.. క్యాపిట‌ల్ హిల్ వ‌ద్ద భార‌తీయుల ర్యాలీ

అయోధ్య‌లో వేడుక.. క్యాపిట‌ల్ హిల్ వ‌ద్ద భార‌తీయుల ర్యాలీ

హైద‌రాబాద్‌: మ‌రికాసేప‌ట్లో అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం కోసం భూమిపూజ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో అమెరికాలోని భార‌తీయులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. వాషింగ్ట‌న్ డీసీలోని క్యాపిటల్ హిల్(పార్ల‌మెంట్ భ‌వ‌నం) వ‌ద్ద భారీ సంఖ్య‌లో ర్యాలీ తీశారు. కొంద‌రు కాషాయం వ‌స్త్రాలు ధ‌రించి.. జెండాలు ప‌ట్టుక‌ని.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మ‌రో వైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ప్రోటోకాల్ ప్ర‌కారం భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. హ‌నుమాన్ ఘ‌డి వ‌ద్ద ప్ర‌ధాని మోదీ ఇవాళ పూజ‌లు నిర్వ‌హిస్తారు.

అయోధ్య‌కు ప్ర‌ధాని మోదీ రావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఆయ‌న్ను వెండి కిరీటంతో స‌త్క‌రిస్తామ‌ని హ‌నుమాన్ ఘ‌డి ప్ర‌ధాన పూజారి గ‌డ్డిన్‌షీన్ ప్రేమ్‌దాస్ జీ మ‌హారాజ్ తెలిపారు. హ‌నుమాన్‌ఘ‌డిలో ఉన్న 3.5 క్వింటాళ్ల బెల్‌ను మోగించిన త‌ర్వాత మోదీ.. రామ జ‌న్మ‌భూమి వ‌ద్ద‌కు వెళ్తార‌న్నారు. అక్క‌డ రామ్‌ల‌ల్లాకు పూజ‌లు చేసిన ఆ తర్వాత భూమిపూజలో పాల్గొంటారు.


logo