శనివారం 30 మే 2020
International - Mar 30, 2020 , 12:34:28

పాకిస్థాన్‌లో వాళ్ల‌కు భోజ‌నం లేద‌ట‌!

పాకిస్థాన్‌లో వాళ్ల‌కు భోజ‌నం లేద‌ట‌!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పాకిస్థాన్‌పై తీవ్రంగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్యను ప‌క్క‌న‌పెడితే పాకిస్థాన్‌లో నిరుపేద‌లు ఆక‌లికి అల‌మటించాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. వేల మంది నిరుపేద‌లు క‌రాచీలోని రెహ్రీ ఘోత్ ప్రాంతానికి చేరుకుని త‌మ క‌డుపులు నింపే దాత‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో వారికి ఆహారం అందిస్తున్న‌ది.  

అయితే, కొంత‌మంది స్వ‌చ్ఛంధ సంస్థ‌ల నిర్వాహ‌కులు, నేత‌లు మాత్రం హిందూ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి భోజ‌నం లేద‌ని ఖ‌రాకండిగా చెబుతున్నార‌ట‌. త‌మ ద‌గ్గ‌ర ముస్లింల‌కే స‌రిప‌డా ఆహారం లేదంటూ హిందువుల‌ను వెళ్ల‌గొడుతున్నార‌ట‌. పాకిస్థాన్‌లోని సింధ్‌, క‌రాచీ ప్రాంతాల్లో సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు హిందువులు ఉన్నారు. అయితే ఆ హిందువులంతా తీవ్ర ఆహారం సంక్షోభంలో ఉన్నార‌ని, భార‌త ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి వారి ఆక‌లి తీర్చాల‌ని సింధ్ ప్రాంతానికే చెందిన పొలిటిక‌ల్ యాక్టివిస్ట్ అమ్జాద్ ఆయుబ్ మిజ్రా కోరారు.   


logo