శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 22:30:51

బ్రిటన్‌లో కోట్లు దోచేసి జల్సా.. భారతీయ మహిళ ఆస్తులు జప్తు

బ్రిటన్‌లో కోట్లు దోచేసి జల్సా.. భారతీయ మహిళ ఆస్తులు జప్తు

లండన్‌: నైజీరియన్‌తో కలిసి క్రెడిట్‌ కార్డు మోసాలకు పాల్పడి కోట్ల రూపాయలు దోచేసిన భారతీయ బ్రిటిషర్‌ మహిళ గుట్టును లండన్‌ పోలీసులు ఛేదించారు. వారినుంచి మిలియన్‌ పౌండ్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయొడెల్‌ ఒలుసెయో ఒడెవెల్ అనే పాత నేరస్థుడితో కలిసి భారతీయ బ్రిటిషర్‌ సారాభారత్‌ యాదవ్‌ కొంతకాలంగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతోంది.

వారి ఆర్థిక కార్యకలాపాలపై అనుమానం వచ్చి.. నేషనల్‌ క్రైం ఏజెన్సీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా మోసం బయటపడింది. లండన్‌లోని ధనికుల వివరాలను సేకరించి వారి పేరుతో క్రెడిట్‌ కార్డులు తీసుకొని డబ్బు కాజేస్తున్న ఆ ఇద్దరిని ఎన్‌సీఏ పోలీసులు అరెస్టు చేశారు.. బ్రిటన్‌ హైకోర్టు ఆదేశాల మేరకు వీరి ఆస్తులను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.


logo