ఆదివారం 23 ఫిబ్రవరి 2020
అమెరికాలో భారత ఉబెర్‌ డ్రైవర్‌కు ఏడాది జైలు

అమెరికాలో భారత ఉబెర్‌ డ్రైవర్‌కు ఏడాది జైలు

Feb 15, 2020 , 00:57:59
PRINT
అమెరికాలో భారత ఉబెర్‌ డ్రైవర్‌కు ఏడాది జైలు
  • దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని తరలించినందుకు శిక్ష

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన 30 ఏండ్ల యువకుడికి గురువారం అమెరికా కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అమెరికాకు అక్రమంగా వచ్చారని తెలిసి కూడా డబ్బు కోసం వారిని రవాణా చేసినందుకు అతడికి కోర్టు 12 నెలల కారాగార శిక్ష వేసింది. ఫిలడేల్ఫియా రాష్ట్రంలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్‌విందర్‌సింగ్‌ ఉబెర్‌ డ్రైవర్‌. అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డారని తెలిసి కూడా అనేక మంది విదేశీయులను 2019 జనవరి ఒకటి నుంచి మే 20 మధ్య డబ్బు కోసం కారులో తరలించారనే అభియోగంపై జస్‌విందర్‌సింగ్‌ను పోలీసులు 2019 మే 20న అరెస్టుచేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తరలించేందుకు  సింగ్‌ కొంతమొత్తం తీసుకున్నట్టు రుజువు కావడంతో న్యాయస్థానం సింగ్‌కు జైలు శిక్ష విధించింది.


logo