ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 21:53:28

పాక్‌ కవ్వింపు.. దీటుగా జవాబిచ్చిన భారత్‌

పాక్‌ కవ్వింపు.. దీటుగా జవాబిచ్చిన భారత్‌

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వెంబడి నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ అతిక్రమిస్తున్నది. పాకిస్తాన్‌ వైపు నుంచి కవ్వింపు హద్దులు దాటడంతో భారత్‌ తనదైన రీతిలో దీటుగా జవాబిచ్చింది. గురువారం ఉదయం నుంచి పూంచ్ జిల్లాలోని షాపూర్, కిరణి సెక్టార్లలో పాకిస్తాన్ నిరంతరం కాల్పులు జరుపగా.. భారత్‌ జరిపిన ప్రతికాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన  10 బెలూచ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు హతమయ్యారు. అనేక మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక బంకర్లు కూడా ధ్వంసమయ్యాయని, పాకిస్తాన్‌ బూడిద చికారి ప్రాంతంలోని పోస్టులను భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

పూంచ్ జిల్లాలోని షాపూర్, కస్బా, కిరణి సెక్టార్లపై గురువారం ఉదయం 9:30 నుంచి పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైనికులు కూడా తగినరీతిలో సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అక్కడి భారత హైకమిషన్ వద్ద నిరసన నమోదు చేయడానికి కృషి చేస్తున్నట్టుగా సమాచారం.


logo