మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 14:10:07

భార‌త బ‌ల‌గాలు అక్ర‌మంగా ఎల్ఏసీ దాటాయి : చైనా

భార‌త బ‌ల‌గాలు అక్ర‌మంగా ఎల్ఏసీ దాటాయి :  చైనా

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లోని పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద సెప్టెంబ‌ర్ 7వ తేదీన జ‌రిగిన ఘ‌ట‌న‌పై చైనా విదేశాంగ శాఖ ఇవాళ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  భార‌తీయ సైనిక ద‌ళాలు అక్ర‌మంగా వాస్త‌వాధీన రేఖ దాటి, పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ద‌క్షిణ ప్ర‌దేశంలోకి ప్ర‌వేశించిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. భార‌తీయ ద‌ళాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధంగా ఉన్న త‌మ పెట్రోలింగ్ ద‌ళాల‌పై హెచ్చ‌రిక కాల్పులు చేసిన‌ట్లు చైనా ఆరోపించింది. అయితే ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు త‌మ ద‌ళాలు ప్ర‌య‌త్నించాయ‌ని చైనా పేర్కొన్న‌ది.  భార‌త్ త‌న వైఖ‌రి అన్ని ఒప్పందాల‌ను ఉల్లంఘించిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. చాలా తీవ్ర స్థాయిలో సైనిక క‌వ్వింపు జ‌రిగిన‌ట్లు డ్రాగ‌న్ పేర్కొన్న‌ది. త‌క్ష‌ణ‌మే ప్ర‌మాద‌క‌ర‌మైన ఎత్తుల‌ను ఆపేయాలంటూ దౌత్య‌ప‌రంగా, సైనిక‌ప‌రంగా భార‌త్‌కు విన్న‌వించామ‌ని చైనా వెల్ల‌డించింది. వాస్త‌వాధీన రేఖ దాటిన‌వారిని వెంట‌నే వెన‌క్కి తీసుకువెళ్లాల‌ని చైనా డిమాండ్ చేసింది. అయితే చైనా చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త ఆర్మీ ఖండించింది. భార‌తీయ పోస్టుల వద్ద‌కు చైనా పీఎల్ఏ ద‌ళాలు వ‌చ్చి ఫైరింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు భార‌త ర‌క్ష‌ణ‌శాఖ చెప్పింది. 


logo