శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 02:44:06

ట్రంప్‌ చేతుల మీదుగా పౌరసత్వం

ట్రంప్‌ చేతుల మీదుగా పౌరసత్వం

  • భారతీయ టెకీ సుధకు స్వయంగా అందజేసిన అమెరికా అధ్యక్షుడు 
  • మరో నలుగురికి కూడా.. 

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్ష భవనంలో ఓ అరుదైన కార్యక్రమం జరిగింది. భారతీయ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సుధాసుందరి నారాయణన్‌తోపాటు ఐదు దేశాలకు చెందిన ఐదుగురికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దగ్గరుండి అమెరికా పౌరసత్వాలు అందజేశారు. భారత్‌, బొలీవియా, లెబనాన్‌, సూడాన్‌, ఘనా దేశాలకు చెందిన ఐదుగురిచేత మంగళవారం జరిగిన నేచురలైజేషన్‌ కార్యక్రమంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ చాడ్‌వోల్ఫ్‌ ప్రమాణం చేయించారు. సుధాసుందరితోపాటు ఐదుగురు తమ కుడిచేతిని పైకెత్తి, ఎడమచేతిలో అమెరికా జాతీయ జెండాను పట్టుకొని అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారు. వారికి ట్రంప్‌ సాదర స్వాగతం పలికారు. ‘మతం, జాతి, రంగు ఆధారంగా వివక్ష లేని అద్భుతమైన దేశంలోకి మీకు స్వాగతం. మీరంతా అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్నవారు. సుధా సుందరి నారాయణన్‌  అమెరికాకు ఎంతో సేవ చేస్తున్నారు’ అని కొనియాడారు. 


logo