గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 11, 2020 , 17:46:38

షార్జాలో భార‌తీయ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

షార్జాలో భార‌తీయ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

దుబాయ్ : షార్జాలో భార‌తీయ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 21 ఏళ్ల భార‌తీయ విద్యార్థి జ్యోత్ షార్జాలోని అల్ రోల్లా ప్రాంతంలోని త‌న అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విద్యార్థి కంప్యూట‌ర్ ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. మృతుడి సోద‌రుడు నిరాల్ మీడియాతో మాట్లాడుతూ.. జ్యోత్ ఇటువంటి చ‌ర్య‌కు పాల్ప‌డుతాడ‌ని కుటుంబ స‌భ్యులెవ‌రం అనుకోలేద‌న్నాడు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ప్పుడు జ్యోత్ ఒక్క‌డే ఇంట్లో ఉన్న‌ట్లు తెలిపాడు. అత‌డు ఏం ఆలోచిస్తున్నాడో, అత‌ని మైండ్‌లో ఏముందో త‌మ‌కు తెలియ‌ద‌న్నాడు. ఎటువంటి లేఖ‌ను కూడా రాయ‌లేద‌న్నాడు. అత‌న్ని ఏది ఇబ్బందుల‌కు గురిచేసిందో తెలియ‌రాలేద‌న్నాడు. చ‌దువులో సైతం చురుకైన విద్యార్థి అని తోటి స్నేహితులు, అధ్యాప‌కులు తెలిపారు.