సోమవారం 06 జూలై 2020
International - Jun 08, 2020 , 15:25:13

నేపాల్‌లో భారతీయ పాఠశాలలు

నేపాల్‌లో భారతీయ పాఠశాలలు

ఖాట్మండు: నేపాల్‌లోని విద్యావ్యవస్థ సాధారణంగా భారతీయ విద్యావ్యవస్థనే పోలి ఉంటుంది. నేపాల్‌లో కూడా త్రి టయర్‌ 16 ఏండ్ల విద్యావిధానమే కొనసాగుతున్నది. నేపాల్‌లో తొలిపాఠశాలను గురుకుల పాఠశాల మాదిరిగా 1853లో అక్కడి మహారాజు జంగ్‌ బహదూర్‌ రాణా స్థాపించారు. నేపాల్‌లో పాఠశాలల విద్యాను అందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇప్పటికే నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ పాఠశాలలు నడుస్తుండగా.. రాజధాని నగరం ఖాట్మండులో కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేసి పాఠశాల విద్య అందిస్తున్నారు. పబ్లిక్‌ స్కూళ్లలో నేపాలీ భాషలో విద్యాభ్యాసం కొనసాగుతుండగా.. విదేశాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూళ్లు సహా సీబీఎస్‌ఈ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టాయి. 

గతంలో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల మేరకు అక్కడి విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటుచేసేందుకు భారత్‌కు చెందిన అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నేపాల్‌లోని ఏడు జిల్లాల్లో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. నేపాల్‌లో మొత్తం 56 హయ్యర్ సెకండరీ పాఠశాలల ఏర్పాటుకు ఈ ఒప్పందం చేసుకొన్నారు. 


logo