ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 16:34:07

భారత ఫార్మా రంగానికి ఆ సామర్థ్యం ఉంది : బిల్‌గేట్స్‌

భారత ఫార్మా రంగానికి ఆ సామర్థ్యం ఉంది : బిల్‌గేట్స్‌

భారత్‌.. తన ప్రజలతో పాటు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను అందించగలదని, ఆ సత్తా  భారత ఫార్మా రంగానికి ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్‌ అన్నారు. భారత్‌లో ముఖ్యమైన ఆవిష్కరణలు ఎన్నో జరిగాయని వివరించారు. ఇతర వ్యాధుల కోసం  ఏర్పాటు చేసుకున్న వనరులను కరోనా వ్యాక్సిన్‌ తయారీకి వినియోగించడం అభినందనీయమన్నారు. డిస్కవరీ ప్లస్‌లో గురువారం సాయంత్రం ప్రసారమయ్యే ‘కొవిడ్‌-19 మహమ్మారి పై భారత్‌ పోరాటం’ డాక్యుమెంటరీలో గేట్స్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.  పెద్ద దేశం, అధిక జనాభా, నగర జనసాంద్రత హెచ్చు స్థాయిలో ఉన్న భారత్‌.. కరోనా వైరస్‌పై తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ‘భారత్‌కు‌ ఎంతో సత్తా ఉంది. అక్కడి  డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచామంతటికీ వ్యాక్సిన్లను అందించగలవు. ఎన్నో వ్యాక్సిన్‌లను భారత్‌ తయారుచేస్తుందని, అక్కడి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చాలా పెద్దది’ అని భారత ఫార్మా సంస్థలను ప్రశంసించారు. 

భారతదేశంలో భారత్‌ బయోటెక్‌, బయో - ఈ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. వారు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్‌కు రూప కల్పన చేస్తారన్నారు. అక్కడి ఫార్మారంగం ప్రపంచానికి వ్యాక్సిన్‌ను అందించి, అందరికి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ప్రస్తుతం  భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నా, పకడ్బందీ చర్యలు తీసుకొంటుందని తెలిపారు.


logo