శనివారం 06 జూన్ 2020
International - May 11, 2020 , 12:13:24

మ‌నీలా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న భార‌తీయులు

మ‌నీలా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న భార‌తీయులు

ముంబై: లాక్ డౌన్ ప్ర‌భావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తర‌లించేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో నిలిచిపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా స్వ‌దేశానికి తీసుకొస్తోంది. భార‌తీయ ప్ర‌యాణికుల బృందం ఫిలిప్పీన్స్ లోని మ‌‌నీలా ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వారికి అధికారులు స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. విద్యార్థులు, ఇత‌ర‌లు మ‌నీలా నుంచి సొంత రాష్ట్రం గుజ‌రాత్ చేరుకోనున్నారు.  

ఇప్ప‌టికే ఫిలిప్పీన్స్, మ‌నీలాలో చిక్కుకున్న వారిలో 241 మంది ప్ర‌యాణికులు ఎయిరిండియా ప్ర‌త్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు.  ప్ర‌యాణికులంద‌రికీ స్క్రీనింగ్ నిర్వ‌హించిన అధికారులు, నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. 




ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo