ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 02:57:48

జాగింగ్‌ చేస్తుండగా హత్య!

జాగింగ్‌ చేస్తుండగా హత్య!

హ్యూస్టన్‌: అమెరికాలోని డల్లాస్‌లో క్యాన్సర్‌ పరిశోధకురాలుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన మహిళ శర్మిష్ఠ సేన్‌ హత్యకు గురయ్యారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని ప్లేనోలోని ఓ పార్కు సమీపంలో శనివారం జాగింగ్‌ చేస్తున్న ఆమెను అగంతకులు యాదృచ్ఛికంగా దాడిచేసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి 29 ఏండ్ల వయసున్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


logo