గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 14:23:28

అమెరికాలో భార‌త సంత‌తి మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం

అమెరికాలో భార‌త సంత‌తి మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం

న్యూఢిల్లీ: అమెరికాలోని హ్యూస్టన్ యూనివ‌ర్సిటీ  సిస్ట‌మ్ ఛాన్సె‌లర్‌గా ప‌నిచేస్తున్న‌ భారత సంతతి మ‌హిళ రేణు ఖాటోర్‌కు అరుదైన గౌరవం దక్కింది. 61 ఏండ్ల రేణూ ఖాటోర్‌ ప్రఖ్యాత అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌కు ‌(ఏఏఏఎస్‌) ఎంపికై చరిత్ర సృష్టించారు. విద్యారంగానికి అందించిన విశేష‌ సేవలకుగానూ ఆమెకు ఈ గౌరవం ద‌క్కింది. 2020కి సంబంధించి ఏఏఏఎస్‌కు ఎంపికైన వివిధ రంగాల శాస్త్ర‌వేత్త‌లు, స్కాల‌ర్ల‌లో రేణు ఒక‌రిగా ఉన్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన రేణు ఖాటోర్ ఉన్న‌తా విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ సిస్టమ్‌ ఛాన్స్‌లర్‌గా, వర్సిటీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఏఏఏఎస్‌కు ఎంపిక‌చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన తనను చేర్చడంపట్ల రేణు ఖాటోర్‌ సంతోషం వ్యక్తంచేశారు. వివిధ రంగాల్లో సేవ‌లందించిన వారిని గౌర‌వించాల‌న్న ల‌క్ష్యంతో 1780లో ఏఏఏఎస్‌ను ప్రారంభించారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo