మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 06:55:07

భారత సంతతి వైద్యుడికి యూకే అవార్డు

భారత సంతతి వైద్యుడికి యూకే అవార్డు

లండన్‌: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం దక్కింది. కొవిడ్‌-19 సంక్షోభంలో చేసిన సేవలకుగానూ నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రత్యేక అవార్డు లభించింది. కరోనా రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మెషిన్‌ లర్నింగ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న రేమండ్‌ సీమ్స్‌తో కలిసి రవి స్వచ్ఛందంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపికైనట్టు వాళ్లు పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo