సోమవారం 01 జూన్ 2020
International - Apr 07, 2020 , 16:56:03

అమెరికాలో క‌రోనాతో భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు మృతి

అమెరికాలో క‌రోనాతో భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు మృతి

న్యూఢిల్లీ: అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టును పొట్ట‌న‌పెట్టుకుంది. న్యూయార్క్‌లో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే మీడియా సంస్థ‌లో కరెస్పాండెంట్‌గా పనిచేస్తున్న 66 ఏండ్ల పాత్రికేయుడు బ్రహ్మ కంచిబొట్ల క‌రోనా చికిత్స పొందుతూ సోమ‌వారం ఉద‌యం ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 28 ఏండ్లుగా పాత్రికేయ వృత్తిలో కొన‌సాగుతున్న బ‌హ్మ ఇప్పుడు క‌రోనా కాటుకు బ‌లికావ‌డం న్యూయార్క్ మీడియా వ‌ర్గాల్లో విషాదం మిగిల్చింది. 

బ్ర‌హ్మ కంచిబొట్లకు మార్చి 23న క‌రోనా సోకింది. దాంతో ఆయ‌న నివాసంలోనే హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. అయితే మార్చి 28 నాటికి వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్ర‌మ‌వ‌డంతో కుటుంబ‌స‌భ్యులు లాంగ్ ఐస్‌లాండ్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించారు. మార్చి 31 నాటికి శ్వాస తీసుకోవ‌డం కూడా ఇబ్బందిగా మార‌డంతో వైద్యులు వెంటిలేట‌ర్‌పైకి మార్చారు. ఏప్రిల్ 6 నాటికి ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌డంతో బ్ర‌హ్మ తుదిశ్వాస విడిచారు. కాగా, న్యూయార్క్‌లో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంత్య‌క్రియ‌ల కోసం త‌మ తండ్రి మృత‌దేహాన్ని ఇస్తారో లేదోన‌ని బ్ర‌హ్మ కుమారుడు సుడామా కంచిబొట్ల‌ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. బ్ర‌హ్మ‌కు కుమారుడు సుడామాతోపాటు భార్య అంజ‌న‌, కూతురు సుజ‌న ఉన్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo