గురువారం 04 జూన్ 2020
International - May 08, 2020 , 13:02:32

క‌రోనాతో న్యూజెర్సీలో ఇద్ద‌రు భార‌తీయ సంత‌తి వైద్యులు మృతి

క‌రోనాతో న్యూజెర్సీలో ఇద్ద‌రు భార‌తీయ సంత‌తి వైద్యులు మృతి

న్యూయార్క్‌: న‌్యూజెర్సీలో భార‌తీయ సంత‌తికి చెందిన అమెరిక‌న్ తండ్రి, కుమార్తెలు క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. డాక్ట‌ర్ స‌త్యేంద్ర‌దేవ్ ఖ‌న్నా(78), ఆయ‌న కూతురు డాక్ట‌ర్ ప్రియాఖ‌న్నా(43) ఇద్ద‌రూ క‌రోనా మ‌హమ్మారికి బ‌లైపోయారు. డాక్ట‌ర్ స‌త్యేంధ్ర‌ఖ‌న్నా న్యూజెర్సీలోని అనేక ఆస్ప‌త్రుల్లో స‌ర్జ‌న్‌గా, హెడ్ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్‌గా, ద‌శాబ్దాల‌పాటు సేవ‌లందించారు. డాక్ట‌ర్ ప్ర‌యాఖ‌న్నా ఇంట‌ర్‌న‌ల్ మెడిసిన్‌, నేప్రాల‌జీ రెండింటిలోనూ పీజీ చేశారు. ఆర్‌డ‌బ్ల్యూజే బ‌ర్న్‌బ‌స్‌లో భాగ‌మైన యూనియ‌న్ ఆస్ప‌త్రిలో చీఫ్ రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్నారు.

 డాక్ట‌ర్లు ఇద్ద‌రు ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డంలో త‌మ జీవితాన్ని అంకితం చేశార‌ని, వారి కుటుంబం వైద్య‌రంగానికి అంకిత‌మైంద‌ని, వారు లేని లోటు ఎప్ప‌టికి పూడ్చ‌లేనిద‌ని న్యూజెర్సీ గ‌వ‌ర్న‌ర్ ట్విట్ చేశారు. క‌రోనా వైర‌స్ ఇద్ద‌రు స‌మాజ సేవ‌కుల‌ను కోల్పోవ‌డం న్యూజెర్సీ ప్ర‌జ‌ల‌కు బాధ క‌లిగించే విష‌య‌మ‌న్నారు.  పిల్ల‌ల వైద్యురాలైన స‌త్యేంద‌ర్ భార్య కోమ్లిష్‌ను క‌లిసిన గ‌వ‌ర్న‌ర్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న మ‌రో ఇద్ద‌రు కూతుర్లు సుగంధ ఖ‌న్నా ఎమ‌ర్జెన్సీ విభాగంగా వైద్యులుగా, మ‌రో కుమార్తె అనిషా ఖ‌న్నా పిల్ల‌ల వైద్యులుగా ప‌నిచేస్తున్నారు. తాను 35 ఏళ్ల‌కు పైగా ప‌నిచేసిన క్లారా మాస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో స‌త్యంద‌ర్ క‌న్నుముశారు. 


logo