శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 18:11:18

భార‌తీయ ట్రక్ డ్రైవ‌ర్‌పై మ‌రో 33 అద‌న‌పు నేరాభియోగాలు

భార‌తీయ ట్రక్ డ్రైవ‌ర్‌పై మ‌రో 33 అద‌న‌పు నేరాభియోగాలు

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో నలుగురు పోలీసు అధికారుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన భార‌తీయ సంత‌తి ట్ర‌క్ డ్రైవ‌ర్‌పై మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాతో స‌హా మ‌రో 33 అద‌న‌పు నేరాభియోగాలు న‌మోద‌య్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న మెల్‌బోర్న్ రహదారిపై లైనెట్ టేలర్, కెవిన్ కింగ్, గ్లెన్ హంఫ్రిస్, జోష్ ప్రెస్ట్నీ అనే నలుగురు పోలీసు అధికారులను హత్య చేసినట్లుగా భార‌తీయ ట్ర‌క్ డ్రైవ‌ర్‌ మొహిందర్ సింగ్‌పై ఆరోప‌ణ‌లు. అంత‌కుక్రితం సైతం అతనిపై నాలుగు నేరారోపణలు ఉన్న‌ట్లుగా స‌మాచారం. కెవ్ స‌బ‌ర్బ్ వ‌ద్ద ఈస్ర్ట‌న్ ఫ్రీ వే పై ఎమ‌ర్జెన్సీ లేన్‌లో పోలీసు అధికారులు నిల‌బ‌డి ఉన్నారు. వీరిని ట్ర‌క్‌తో మొహింద‌ర్ సింగ్ వెనుక‌నుంచి ఢీకొట్ట‌డంతో సంఘ‌ట‌నా స్థ‌లంలోనే వీరంతా చ‌నిపోయారు. 

విక్టోరియన్ పోలీసులు బుధవారం స్పందిస్తూ... ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సింగ్ మరో 33 నేరాలకు పాల్ప‌డిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడ‌న్నారు. వాటిలో నాలుగు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తూ ప‌లువురి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన‌వి ఉన్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణాతో పాటు మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు ఉన్నాయన్నారు.


logo