శనివారం 06 జూన్ 2020
International - May 15, 2020 , 16:47:25

పరిశోధనల్లో మేటి.. మన అరోనా.!

పరిశోధనల్లో మేటి.. మన అరోనా.!

ప్ర‌పంచం ఇప్పుడు క‌రోనాతో పోరాడుతున్న‌ది. అయిన‌ప్ప‌టికీ ప్లాస్టిక్ వాడ‌కం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. త‌క్కువ ధ‌ర ప్లాస్టిక్ క‌న్నా, ఎక్కువ రేటు గ‌ల ట‌ప్ప‌ర్‌వేర్ ప్రొడ‌క్ట్స్ మ‌ట్టిలో క‌లిసిపోవ‌డానికి ఎక్కువ రోజులు ప‌డుతుంది. ప్లాస్టిక్ కోసం ఎక్కువ ఖ‌ర్చుపెడుతున్న త‌ల్లిదండ్రుల‌ను అరోరా గ‌మ‌నిస్తూ వ‌చ్చింది. 13 ఏండ్ల వ‌య‌సులో దానికి ప‌రిష్కారం క‌నుగొనాల‌నుకున్న‌ది. దానికోస‌మే సైన్స్ ఫీల్డ్‌ను ఎంచుకున్న‌ది. అదేబాట‌లో వెళ్తూ ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్న‌ది. 

వివిధ ర‌కాల మొక్క‌ల ఆధారిత ముడి ప‌దార్థాల నుంచి బ‌యోడిగ్రేడ‌బుల్ ప్లాస్టిక్‌ను త‌యారు చేశానని అలాగే మొక్క‌జొన్న స్టార్చ్‌తో కొంత‌వ‌ర‌కు విజ‌యం సాధించింనట్లు మే 2019లో జ‌రిగిన టెడ్ఎక్స్‌ యూత్ అనే చ‌ర్చ‌లో చెప్పింది. మొక్క‌జొన్న‌తో త‌యారు చేసిన ప్లాస్టిక్ ఆహార‌ప‌దార్థాలు ప్యాక్ చేయ‌డానికి ప‌నికిరాదు. అందుక‌ని రొయ్య‌ల పెంకులు, గుడ్లు, పీత తోక‌లు, చేప‌ల త‌ల‌ల‌తో త‌యారు చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి ప‌రిశోధ‌న‌లు ప్రారంభించింది. ఆమె పరిశోధనలకు గాను ఆస్ట్రేలియ‌న్ జియోగ్రాపిక్ సొసైటీ ఆఫ్ యంగ్ క‌న్జ‌ర్వేష‌నిస్ట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా అరోరాను ఎంపిక చేశారు. ల‌క్ష్యం సాదించేవ‌ర‌కు ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తానంటున్న‌ది భార‌త- ఆస్ట్రేలియ‌న్‌కు చెందిన 17 ఏండ్ల అరోరా. మనం కూడా అరోరా విజయం సాధించాలని కోరుకుందాం.


logo