గురువారం 28 మే 2020
International - May 08, 2020 , 17:11:08

మాల్దీవుల నుంచి ప్రారంభ‌మైన స‌ముద్ర సేతు ఐఎన్ఎస్ జ‌లాశ్వ‌

మాల్దీవుల నుంచి ప్రారంభ‌మైన స‌ముద్ర సేతు ఐఎన్ఎస్ జ‌లాశ్వ‌

మాల్దీవులు :  లాక్‌డౌన్ బాధితుల‌ను ఇత‌ర దేశాల నుంచి జ‌ల మార్గం ద్వారా తీసుకురావ‌డానికి నిర్వ‌హించే ఆప‌రేష‌న్‌కు స‌ముద్ర సేతు అని పేరుపెట్టారు. ఈ రోజు నావికా ద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ జ‌లాశ్వ‌లో మొద‌టి బ్యాచ్ భార‌తీయ పౌరులు మాల్దీవుల్లోని మాలే ఓడ‌రేవు నుంచి బ‌య‌లుదేరారు. నౌక‌లో 19 మంది గ‌ర్భిణీలు, 14 మంది పిల్ల‌ల‌తో స‌హా మొత్తం 732 మంది ప్ర‌యాణికులున్నారు. ఈ నౌక కొచ్చిలోని నౌకాశ్ర‌యానికి చేరుకుంటుంది. భార‌తీయ నౌక‌ద‌ళం మొద‌టి సారి త‌మ నౌక‌లో ప్ర‌యాణించిన వారి నుంచి ఛార్జీలు వ‌సూలు చేస్తుంది. ఇంత‌కు ముందు ఇలా ఎప్పుడూ ఛార్జీలు వ‌సూలు చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు. 


logo