సోమవారం 30 మార్చి 2020
International - Mar 16, 2020 , 15:51:14

ప్రియురాలి గొంతు కోసి.. శవంతో పోలీసు స్టేషన్‌కు

ప్రియురాలి గొంతు కోసి.. శవంతో పోలీసు స్టేషన్‌కు

దుబాయి : ప్రియురాలే లోకంగా బతికాడు.. తిరిగాడు. ఆమె అంటే పిచ్చి.. అంతటి ప్రేమలో మునిగిన ఓ ప్రియుడు.. మృగంలా మారాడు. తనను కాదని మరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న ఆ భగ్న ప్రేమికుడు.. ఆమెను అత్యంత దారుణంగా చంపాడు. ఆ తర్వాత ప్రియురాలి శవంతో 45 నిమిషాల పాటు డ్రైవింగ్‌ చేశాడు. ఈ ఘటన దుబాయిలో గతేడాది జులై నెలలో చోటు చేసుకుంది. అయితే కోర్టులో విచారణ సందర్భంగా పోలీసులు ఈ కేసు విషయాలు ఇవాళ వెల్లడించారు. 

భారత సంతతికి చెందిన ఓ యువకుడు(27) దుబాయిలో ఉంటున్నాడు. అక్కడే ఓ యువతి పరిచయం అయింది. ఆమెది కూడా ఇండియానే. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమలో అనుమానం చొరబడింది. తన ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటుందని ప్రియుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో పలుమార్లు వీరిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. 

అయితే ఒకరోజు తనతో మాట్లాడాలని యువతిని బయటకు పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన యువకుడు ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ప్రియురాలి శవాన్ని తన సీటు ముందు పెట్టుకుని 45 నిమిషాల పాటు దుబాయి పరిసర ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేశాడు. అంతకంటే ముందే ఓ రెస్టారెంట్‌ వద్ద నిలిపి ఆహారం కూడా తీసుకున్నాడు. 

ఆ తర్వాత ఆమె శవంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు యువకుడు. రక్తపు మరకలతో ఉన్న అతన్ని చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. కారును పరిశీలించగా.. సీటు వెనుకాల కత్తి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసును ఆదివారం కోర్టు విచారించింది. మృతురాలి తరపు న్యాయవాది వాదిస్తూ.. నిందితునికి మరణ శిక్ష విధించాలని కోర్టును కోరారు. 


logo