శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 12:31:10

అమెరికాలో భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల నిరసన

అమెరికాలో భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల నిరసన

వాషింగ్టన్‌ : గ్రీన్‌ కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలో భారతీయులు నిరసన వ్యక్తం చేశారు.  వాషింగ్టన్‌లో ‘ఈక్వాలిటీ ర్యాలీ’ పేరిట ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉంటున్న వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఇతర ఉద్యోగులు గ్రీన్‌ కార్డు కోసం చాలా కాలం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుత విధానంలో మార్పులు తెస్తూ ‘తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యం’ విధానంతో గ్రీన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.

దీనికి సంబంధించి ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రంట్స్‌ యాక్ట్‌’ పేరిట బిల్లును తీసుకువచ్చారు. అయితే దీన్ని డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ డిక్‌ డర్బిన్‌ వ్యతిరేకించడంతో బిల్లు నిలిచిపోయింది. ఆయన తీరుకు నిరసనగా భారతీయ హెచ్‌-1బీ వీసాదారులు ఆందోళన చేపట్టారు.భారతీయులపై ఉన్న ద్వేషాన్ని వదులుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తు నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ దేశ ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్న వారికి గ్రీన్‌ కార్డుల జారీని అడ్డుకోవడం అన్యాయమన్నారు.

ఆశ్రయం కోసం దేశంలోకి అక్రమంగా వచ్చిన మైనర్లకు కల్పించే అన్ని హక్కుల్నీ చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన మైనర్లకు కూడా కల్పించాలన్నారు.   ఆశ్రయం కోరుతూ వచ్చిన మైనర్లకు చట్టబద్ధంగా అన్ని హక్కుల్ని కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo