సోమవారం 18 జనవరి 2021
International - Jan 07, 2021 , 15:03:31

క్యాపిట‌ల్ హిల్ హింస‌: త‌్రివర్ణ ప‌తాకం ఎందుకు క‌నిపించింది?

క్యాపిట‌ల్ హిల్ హింస‌: త‌్రివర్ణ ప‌తాకం ఎందుకు క‌నిపించింది?

వాషింగ్ట‌న్‌: అమెరికాలోని క్యాపిట‌ల్ హిల్ బిల్డింగ్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు దాడి చేసిన సంగతి తెలుసు క‌దా. ఈ హింస‌లో న‌లుగురు చ‌నిపోగా.. ఎంతో మంది గాయ‌ప‌డ్డారు. ఇది ట్రంప్ చేసిన తిరుగుబాటుగా చాలా మంది అభివ‌ర్ణించారు. అయితే ఈ నిర‌స‌న‌ల్లో ఒక వీడియో ఇప్పుడు ఇండియ‌న్స్‌ను ఆక‌ర్షించింది. ఆ వీడియోలో ఓ వ్య‌క్తి భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప‌ట్టుకొని కనిపించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రు? అత‌డు ఏ పార్టీకి చెందిన‌వాడ‌న్న దానిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. కానీ అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ్య‌తిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ ఫ్లాగ్ క‌నిపించడానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. అక్క‌డ మ‌న జెండా ఎందుకు ఉందంటూ ప్ర‌శ్నించారు బీజేపీ లోక్‌స‌భ ఎంపీ వ‌రుణ్ గాంధీ. ఈ పోరాటంలో మ‌నం పాలుపంచుకోవాల్సిన అవ‌స‌రం అస‌లే లేదంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.