సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 18:28:39

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో సత్తా చాటిన మన రైతు బిడ్డ

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో సత్తా చాటిన మన రైతు బిడ్డ

రియాలిటీ షో అమెరికాస్ గాట్ టాలెంట్‌ 15 వ ఎడిషన్ లో బ్యాడ్ సల్సా గ్రూప్ అదరగొట్టింది. తమ ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌తో అందరి మనుసు దోచుకున్నారు. బాలీవుడ్ పాటకు సల్సా డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. ఈ సల్సా గ్రూపులో భారత్ కు చెందిన ఓ సాదాసీదా రైతు కుమార్తె సోనాలి మజుందార్, కోల్‌కతాకు చెందిన మరాజు సుమంత్ సహా మరో ఇద్దరు డ్యాన్సర్లున్నారు.

సోనాలి మజుందార్ తండ్రి సాధారణ రైతు. రోజంతా పనిచేస్తే వంద రూపాయలు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నాడు. డబ్బు తగినంతగా లేకపోవడం వల్ల తినడానికి ఆహారం కూడా తమకు లేదని సోనాలి అత్యంత దీనంగా చెప్పారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో డ్యాన్స్ సాధన చేసి ఇంతదూరం రాగలిగామని, తప్పకుండా మేం అమెరికా ప్రజల మనసు దోచుకుంటామని సోనాలి, సుమంత్ చెప్పారు. వీరు రెగ్యులర్ డ్యాన్స్ ప్రాక్టీస్ తో పాటు బ్యాడ్ సల్సా డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లు వారు పేర్కొన్నారు. నిత్యం 8-10 గంటల పాటు ప్రాక్టీస్ చేశామని, మరిన్ని డ్యాన్సులను మా నుంచి ఆశించవచ్చునన్నారు.

వీరు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన 'గోలియోన్ కి రాస్ లీలా: రామ్-లీలా సినిమాలోని పాట' తట్టాడ్ తట్టాడ్'లో వీరిద్దరూ సల్సా డ్యాన్స్ ప్రదర్శించారు. వీరి అద్భుత డ్యాన్స్ న్యాయమూర్తుల మనసును కదిలించింది.logo