శనివారం 28 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 02:40:09

ఐరాసలో భారత్‌కు కీలక పదవి

ఐరాసలో భారత్‌కు కీలక పదవి

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) సలహా కమిటీకి భారత దౌత్యవేత్త విదిషా మైత్రా ఎన్నికయ్యారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ  అనుబంధ సంస్థ అయిన పరిపాలన అండ్‌ బడ్జెట్‌ ప్రశ్నలకు సంబంధించిన ఐరాస సలహా కమిటీ (ఏసీఏబీక్యూ)లో ఆమెకు ఈ స్థానం దక్కింది. ఆసియా-పసిఫిక్‌ దేశాల బృందంలో ఐరాస భారత శాశ్వత మిషన్‌కు మొదటి కార్యదర్శి అయిన మైత్రా 126 ఓట్లు సాధించి ఈ స్థానానికి ఎన్నికయ్యారు. పరిపాలన, బడ్జెట్‌ అంశాలపై పనిచేసే ఐదో సర్వసభ్య కమిటీ మైత్రాను ఈ పదవికి సిఫారసు చేసింది. 2021, జనవరి 1 నుంచి మూడేండ్ల వరకు సలహా కమిటీకి ఈమె సభ్యురాలిగా ఉంటారు.