గురువారం 04 జూన్ 2020
International - May 11, 2020 , 18:52:12

కువైట్‌లో క‌‌రోనా బారిన‌ప‌డి భార‌త దంత ‌వైద్యుడు మృతి

కువైట్‌లో క‌‌రోనా బారిన‌ప‌డి భార‌త దంత ‌వైద్యుడు మృతి

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి కువైట్‌లో భార‌తీయ దంత వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. భార‌త్‌కు చెందిన 54 ఏండ్ల వాసుదేవ రావు గత 15 ఏండ్లుగా కువైట్ ఆయిల్ కంపెనీలు దంత వైద్యుడిగా సేవ‌లందిస్తున్నాడు. ప్ర‌భుత్వ సంస్థ అయిన కువైట్ పెట్రోలియం కార్పొరేష‌న్‌కు అనుబంధ సంస్థే కువైట్ ఆయిల్ కంపెనీ. వాసుదేవ‌రావుకు కొన్ని రోజుల క్రితం క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో జ‌బేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం ఆయ‌న క‌న్నుమూశారు. వాసుదేవ రావు మృతితో కువైట్‌లో క‌రోనా బారినప‌డి మ‌ర‌ణించిన వైద్యుల సంఖ్య రెండుకు చేరింది. గ‌త శుక్ర‌వారం ఈజిప్టుకు చెందిన 62 ఏండ్ల ఈఎన్‌టీ వైద్యుడు మొఖీమ‌ర్‌ కువైట్‌లో క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించాడు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo