శనివారం 04 జూలై 2020
International - Jun 21, 2020 , 08:32:56

లండన్‌ సముద్ర జలాల్లో.. 1500 మంది భారతీయులు

లండన్‌ సముద్ర జలాల్లో.. 1500 మంది భారతీయులు

లండన్‌: లండన్‌ సమీపంలోని టిల్బరీ పోర్టులో నిలిపి ఉంచిన ఎంవీ ఆస్టోరియాతో పాటు మరో నాలుగు క్రూయిజ్‌ నౌకల్లో దాదాపు 1,500 మంది భారతీయ క్రూయిజ్‌ సిబ్బంది (నౌకలలో పనిచేసే సిబ్బంది) చిక్కుకుపోయారు. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 90 రోజులుగా తాము సముద్ర జలాల్లోనే ఉండాల్సి వచ్చిందని.. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌కు రాసిన ఓ లేఖలో అభ్యర్థించారు.   


logo