ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు.
వేడిని నియంత్రించేందుకు ప్రతి గదిలోనూ గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి.
మధ్యాహ్నం పూట ఎండ నేరుగా ఇంట్లోకి రాకుండా తలుపులు, కిటికీలను మూసివేయాలి.
మధ్యాహ్నం వంటకు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి.
టీవీ, కంప్యూటర్.. లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి.
సీలింగ్ ఫ్యాన్లను వీలైనంత కిందికి బిగించుకోవాలి.
ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లు పూర్తిగా తగ్గకుండా చూసుకోవాలి.