ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 19:52:34

పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ.. వీడియో

పాక్‌ బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ.. వీడియో

జమ్మూ : దాయాది పాకిస్థాన్ వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా తరచూ తీర నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట, సరిహద్దు గ్రామాలపై తూటాల వర్షం కురిపిస్తుంది. బాంబులతో పాటు మోర్టార్‌ షెల్స్‌ను ప్రయోగిస్తోంది. దీంతో పలు చోట్లతో సైనికులతో పాటు సామాన్య ప్రజలు సైతం గాయపడుతున్నారు. పూంచ్‌  సెక్టార్‌లో పది రోజుల కిందట ప్రయోగించిన మోర్టార్‌ షెల్‌ ఓ ఇంటిపై పడడంతో ఒకే కుటుంబానికి మృతి చెందారు. అలాగే పలువురు గాయపడ్డారు.  తాజాగా పూంచ్‌ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన కర్మరా ప్రాంతంలోని నివాస ప్రాంతాల వద్ద పాక్‌ చెందిన పేలని బాంబులను గుర్తించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్‌ రెండు బాంబులను నిర్వీర్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.



లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo