సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 02:29:10

ట్రంపే గొప్ప.. కాదు.. బైడెన్‌ గ్రేట్‌

ట్రంపే గొప్ప.. కాదు.. బైడెన్‌  గ్రేట్‌

  • రెండుగా చీలిన భారతీయ అమెరికన్లు

న్యూయార్క్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్నవేళ భారతీయ అమెరికన్లు రెండుగా చీలిపోయి అధ్యక్ష అభ్యర్థుల కోసం పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ట్రంప్‌ నాలుగేండ్ల పాలనలో అమెరికాలోని అన్ని వర్గాలను ఏకం చేశారని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌కు చెందిన ప్రభుత్వ సంబంధాల విభాగం మాజీ డైరెక్టర్‌ జయ్‌ కన్సారా అన్నారు. ఓట్ల లెక్కింపుపై డెమోక్రాట్ల వాదన చూస్తుంటే ట్రంప్‌ విజయాలను వాళ్లు ఎన్నటికీ అంగీకరించే పరిస్థితుల్లో లేరని అర్థమవుతున్నదన్నారు. జయ్‌ వ్యాఖ్యలపై అమెరికాలోని దక్షిణాసియా అసోసియేషన్‌ డైరెక్టర్‌ నేహా దేవన మండిపడ్డారు. ‘ట్రంప్‌ పాలనలో అమెరికా సమాజం ముక్కలైంది. అమెరికాలోకి ముస్లింలు రాకుండా నిషేధం, జాతి వివక్ష ఘటనలే ఇందుకు ఉదాహరణ’ అని పేర్కొన్నారు.