శనివారం 16 జనవరి 2021
International - Dec 11, 2020 , 15:53:06

టైమ్ మ్యాగ్జిన్ హీరో లిస్టులో రాహుల్ దూబే..

టైమ్ మ్యాగ్జిన్ హీరో లిస్టులో రాహుల్ దూబే..

హైద‌రాబాద్‌: అమెరికాలోని భార‌త సంత‌తికి చెందిన రాహుల్ దూబే... టైమ్ మ్యాగ్జిన్ హీరోస్ జాబితాలో చేరాడు. హీరోస్ ఆఫ్ 2020లో రాహుల్ దూబే కూడా చోటు సంపాదించాడు.  న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య‌కు నిర‌స‌న‌గా అమెరికాలో నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో సుమారు 70 మంది నిర‌స‌కారుల‌కు త‌న ఇంట్లో రాహుల్ దూబే ఆశ్ర‌యం క‌ల్పించారు. అవ‌స‌ర‌మైన‌వారికి ఆహారాన్ని, ఆశ్ర‌యాన్ని క‌ల్పించి.. 2020వ సంవ‌త్స‌రంలో హీరోల‌కన్నా ఎక్కువ దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు టైమ్ మ్యాగ్జిన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  నిరాశ్ర‌యుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించిన వ్య‌క్తి రాహుల్ దూబే అంటూ టైమ్ మ్యాగ్జిన్ వెల్ల‌డించింది.  

జూన్ ఒక‌టో తేదీన వాషింగ్ట‌న్ డీసీలో నిర‌స‌న‌కారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  వైట్‌హౌజ్ స‌మీపంలోనే దూబే ఇళ్లు ఉన్న‌ది. ఆరోజు రాత్రి అక్క‌డ క‌ర్ఫ్యూ విధించ‌డంతో.. వీధుల్లోనే ఉన్న నిర‌స‌న‌కారుల‌కు దూబేను ఆశ్ర‌యం క‌ల్పించారు. ఆందోళ‌న‌కారుల్ని అరెస్టు చేయాల‌నుకుంటున్న పోలీసుల నుంచి వారిని కాపాడారు.  ఇంటి డోర్లు ఓపెన్ చేసి, లోపలికి రావాలంటూ అరిచాడు.  ఆ రాత్రి క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల నుంచి 70 మంది నిర‌స‌న‌కారుల్ని దూబే ఆదుకున్నాడు. పోలీసులు త‌న ఇంట్లోకి ప్ర‌వేశించేందుకు కూడా ప్ర‌య‌త్నించిన‌ట్లు దూబే చెప్పాడు.