గురువారం 04 జూన్ 2020
International - Apr 25, 2020 , 22:21:06

డెమోక్రటిక్‌ పార్టీ సీఈవోగా వైదొలుగనున్న సీమా నందా

డెమోక్రటిక్‌ పార్టీ సీఈవోగా వైదొలుగనున్న సీమా నందా

వాషింగ్టన్‌: అమెరికాలో విపక్ష డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సీఈఓ, భారత సంతతి అమెరికన్‌ సీమా నందా (48).. ఆ పదవి నుంచి వైదొలుగనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2018 జూన్‌లో ఆమె ఈ పదవిలో నియమితులయ్యారు. అయితే, ఆమె ఎందుకు డెమొక్రటిక్‌ పార్టీ సీఈఓగా వైదొలుగుతున్నారో కారణాలను వెల్లడించలేదు. నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ పేరు ఖరారవుతుందన్న వార్తల నేపథ్యంలో సీమా నందా ఈ పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తున్నది. నందా స్థానంలో 2014 డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జాన్‌ కెర్రీ మేనేజర్‌గా పని చేసిన మేరీ బేథ్‌ కాహిల్‌ నియమితులవుతారని తెలుస్తున్నది. logo